చాలా మంది చెబుతుంటారు నేను స్టాక్ మార్కెట్లో లక్ష పెట్టుబడి పెట్టా .  అది ఇప్పుడు 50,000 రూపాయలకు  పడిపోయినది. స్టాక్ మార్కెట్లో మనము  డబ్బుని పెట్టుబడి పెడితే నష్టాలు తప్పవు .  మీరు మాత్రం పెట్టుబడి పెట్టకండి. అంతా పోతుంది.

 

ఇంకో పక్క చాలామంది చెబుతుంటారు నేను స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెట్టాను. నా 5 లక్షలు 10 లక్షలు లేదా 20 లక్షలు  అయ్యిందండి.  అంత ఎందుకండీ మనదేశంలో చాలామంది ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ధనవంతులు అయ్యారు.  కొందరు లాస్ అవుతుంటారు. కొందరు లాభాలు పొందుతుంటారు. లాస్ అవడానికి  ప్రధానమైన కారణం మనం చేసే తప్పులు అని గుర్తుంచుకోండి. 

 

అయితే ఇక్కడ స్టాక్ మార్కెట్లు లో అస్సలు చేయకూడని కొన్ని మిస్టేక్స్ ఏమిటో మనం నేర్చుకొందాము .  మీరే గనక ఈ మిస్టేక్స్ ని ఫ్యూచర్లో చేయకపోతే ఖచ్చితంగా ప్రాఫిట్స్. ఇది  గ్యారెంటీ .

 

మొదటి తప్పు :  నాలెడ్జ్ లేకుండా పెట్టుబడి పెట్టడం.  అది చాలా చాలా తప్పు.  స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టె ముందు మనకి కంప్లీట్ సమాచారము వుండాలి. అసలు షేర్ అంటే ఏంటి, అసలు స్టాక్ మార్కెట్ లో ధరలు ఎందుకు పెరుగుతుంటాయి? ఎందుకు తగ్గుతుంటాయి ? దానికి కారణం ఏంటి?  అసలు ఒక కంపెనీ షేర్స్ ని పబ్లిక్ ఎలా a lot చేస్తారు ? ఇదంతా మనకి అర్థం కావాలి. ఆ  తరవాత స్టాక్ మార్కెట్లో మన డబ్బుని పెట్టుబడిగా  పెట్టాలి. మనము టెక్నికల్ ఎనాలిసిస్ , అదేవిధంగా ఫండమెంటల్ ఎనాలసిస్ అధ్యయనము చేసిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి.  చాలా మంది చేసే తప్పు ఏమిటంటే , వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, వీళ్ళు పెట్టుబడి పెడుతున్నారు కదా అని, మనం  గుడ్డిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం . ఎటువంటి నాలెడ్జ్ లేకుండా పెట్టుబడి పెట్టడం ఇలా చేయడం వలన మన దేశంలో ఎంతోమండికి , నూటికి తొంబై శాతము పెట్టుబడిదారులు నష్టపోతున్నారు. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అటు మనం పెట్టుబడి పెట్టే ముందు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ ఎనాలసిస్ చేయాలి . ఒక కంపెనీ లో పెట్టుబడి పెట్టె ముందు , ముందుగా ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటి,  కంపెనీ నష్ట లాభాలు , ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి అంతేగాని గుడ్డి గా  పెట్టుబడి పెట్టకూడదు

 

రెండవ తప్పు : చాలా మంది కొత్తవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనుకొని ట్రేడింగ్ తో మొదలు పెడుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎవరో you tuber చెప్పిన మాటలు వింటుంటారు.  “నాకు లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ వలన 10 లక్షలు లాభము వచ్చింది. నెలకు ఇంత వస్తుంది, అంత వస్తుంది అని చెబుతుంటారు. మీరు కూడా చేయండి” అని చెబుతుంటారు. మా దగ్గర demat అకౌంటు ఓపెన్ చేసుకోండి అని లింకు లు పెడుతుంటారు, కొంత మంది మార్పులు చేసి మరీ p/l statement చూపిస్తుంటారు. ఇంకేముంది ఆ మాటలు గుడ్డిగా నమ్మి ట్రేడింగ్ చేస్తూ ఉంటాము. ఇంకా కొంత మంది వడ్డీ లకు అప్పులు చేసి మరీ పెట్టుబడి పెడుతుంటారు. నిజము ఏమిటంటే  మన భారత దేశము లో నూటికి 90 శాతము ఈ విధము గా గుడ్డిగా నమ్మి నష్ట పోతుంటారు. ఇన్వెస్ట్మెంట్ కు ట్రేడింగ్ కు ఎంతో తేడా వుంది అనే విషయము మరచి పోతుంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి ? ఒక కంపెనీ ను పూర్తిగా స్టడీ చేసి , ఆ కంపెనీ బాగున్న ట్లయితే ఆ కంపెనీ యొక్క షేర్స్ ని కొంటాం.  వెంటనే అమ్మేయము. కొన్ని రోజులు/ సంవత్సరములు ను ఆ షేర్ ను అమ్మకుండా వుంచుకొంటాము. ఆ షేరు ధర పెరిగితే మనము అమ్ముకొని లాభలు తీసుకొంటాము. ఇన్వెస్ట్మెంట్ అన్నది లాంగ్ టర్మ్ కు ఉద్దేశించినది.  ముందు తక్కువ పెట్టుబడి తో షేర్ లు కొని , అసలు ఏ విధంగా ఆ షేరు ధర పెరుగుతుంది, తగ్గుతుంది అని గమనించండి. తగ్గితే ఎందుకు తగ్గింది, పెరిగితే ఎందుకు పెరిగింది అని రిసెర్చ్ చేయండి. అలా అవగాహన వచ్చిన తర్వాత, పూర్తి గా మార్కెట్ ను అర్థము చేసుకొన్న తర్వాత అప్పుడు ట్రేడింగ్ ని స్టార్ట్ చేయండి. కొంతమంది జాబ్ చేస్తూ ట్రేడింగ్ చేస్తుంటారు. కానీ గుర్తు పెట్టుకోండి. ట్రేడింగ్ చేసే సమయము లో ఎటువంటి డిస్టర్బ్ లేకుండా వుండాలి. చార్ట్ ను బాగా గమనిస్తూ వుండాలి. రెండు ఒకే సారి చేయడం కష్టము. జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. ఖాళీగా వుంటేనే ట్రేడింగ్ చేయండి. ఆఫీసు లో చాలా మంది ట్రేడింగ్ చేస్తుంటారు. మీటింగ్ అని బాస్ పిలుస్తుంటాడు. ఆ లోపలే వీరు పెట్టుబడి పెట్టి వుంటారు. ఖర్మ ఖాళీ మార్కెట్ రివర్స్ అయితే అంతే నష్టాలను రుచి చూస్తారు. ఇంకొంత మంది బిజినెస్ చేస్తుంటారు. అప్పుడే గిరాకీ వస్తుంది. ఈ లోపల మార్కెట్ పెద్దగా పెరిగినా , పెద్దగా తగ్గినా మనము ఒక్కొక్క సారి చూడటానకి అవకాశము వుండదు. కాబట్టి ట్రేడింగ్ చేయాలంటే ఉదయము 9:30 నుంచి ఖాళీగా వుంటే నే చేయాలి. లేకపోతే ట్రేడింగ్ చేయకూడదు.

 

 

మూడవ తప్పు : అందరూ చేసే ఇంకొక తప్పు ఏమిటంటే తక్కువ కాలము నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. గుర్తుంచుకోండి ఇన్వెస్ట్మెంట్ అంటే కానీసము 5 సంవత్సరాలు అంతకు పైన కాలము వరకు పెట్టుబడులు పెట్టడము. ఏదో షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతుంటారు. ఒక సంవత్సరము , రెండేళ్ళు లక్ష్యాలు పెట్టుకొని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. లాంగ్ టర్మ్ పెట్టుబడి పెడితేనే లాభాలు వస్తాయి.

 

నాల్గవ  తప్పు :  కొంత మంది తమ దగ్గర వున్న డబ్బు అంతా ఒకే రంగము లో పెడతారు.

ఇది చాలా తప్పు. ఒకే సెక్టార్ లో ఎప్పుడు పెట్టకూడదు. Diversification అనే సూత్రము ప్రకారం పెట్టాలి.

 

ఐదవ తప్పు : ఫేక్ న్యూస్ విని ఒక కొంపని లో పెడతారు. ఇక్క కొన్ని కొంపనీ లు ఆడే డ్రామా లకు మోసపోతారు. కొన్ని సోషల్ మీడియా లో వార్తా లను గుప్పించి పెట్టుబడులు రాబడుతారు. రేట్ ను అమాంతం పెంచుకొంటూ పోతారు. వాళ్ళకు కావలసిన రేట్ పెరగా గానే లాభాలు బుక్ చేసుకొని అమ్మనతం పడవేసుకొంటారు. కాబట్టి ఫేక్ న్యూస్ విని ఎప్పుడు స్టాక్ లు కొనరాదు.

 

పైన చెప్పిన ప్రకారము మీరు మరి ఒక సారి గుర్తు వుంచుకొనవలసిన పాయింట్స్ :

 

1)   సరైన మార్కెట్ నాలెడ్జ్ తో నే స్టాక్ ల లో పెట్టుబడులు పెట్టాలి.

2)  ఎవరిని గుడ్డి గా నమ్మ రాదు. తొందరబడి ట్రేడింగ్ లో ఎంటర్ కావద్దు.

3)  ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ అనే పాయింట్ తో నే స్టాక్ ల లో పెట్టుబడులు పెట్టండి.

4)  డబ్బు అంతా ఒకే సెక్టార్ ల లో ఎప్పడూ పెట్టుబడులు పెట్ట వద్దు.

5)  ఫేక్ న్యూస్ ను నమ్మి పెట్టుబడులు ఎప్పుడూ పెట్టవద్దు.

 

ఇవి నాకు తెలిసిన కొన్ని అతి ముఖ్యమైన పాయింట్స్. నేను అనుభవము తో చెబుతున్న విషయాలను అర్థము చేసుకొంటారని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాము.